మిర్యాలగూడలో పారిశుధ్యం అద్వానం, అదనపు కలెక్టర్ అసంతృప్తి – latest news
మిర్యాలగూడలో పారిశుధ్యం అద్వానం,
అదనపు కలెక్టర్ అసంతృప్తి
మిర్యాలగూడ, మన సాక్షి: పట్టణ ప్రగతి లో భాగంగా శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మిర్యాలగూడ పట్టణం లో పర్యటించారు. పట్టణం లో వీధుల్లో పారిశుధ్యం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణం పరి శుభ్రంగా ఉంచాలని, మురుగు నీరు నిల్వ కుండా శుభ్రం చేయాలని అన్నారు. నర్సరీ పరిశీలించి మొక్కలు ఎండిపోవడం గమనించి మొక్కల కు నీరు పోయాలని, ఎండి పోయిన వాటి స్థానం లో కొత్త మొక్కలు పెంచాలని అన్నారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణా క్రీడా ప్రాంగణం ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు వెంకటరమణ ఆసిం బాబా, మధు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
1. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మార్పు : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
2. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ – కుందూరు జానారెడ్డి









