సంక్షేమ, అభివృద్ధిని విస్తృత ప్రచారం చేయాలి..!

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కోరారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ మండల, మాడుగుల పల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సంక్షేమ, అభివృద్ధిని విస్తృత ప్రచారం చేయాలి..!

మిర్యాలగూడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు

మిర్యాలగూడ  , మన సాక్షి :

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కోరారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ మండల, మాడుగుల పల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుబంధు ఇస్తున్నామని, 24 గంటల విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు . వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. 70 సంవత్సరాల నుంచి ఏ పాలకుడికి రాని ఆలోచన కెసిఆర్ కు ఆలోచన వచ్చి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లోని అంశాలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రతి గ్రామంలో , పట్టణంలోని కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీలో నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోడు ఏడుకొండలు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య , వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, తదితరులు పాల్గొన్నారు