Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ జిల్లా బంద్ విజయవంతం..!

Miryalaguda : మిర్యాలగూడ జిల్లా బంద్ విజయవంతం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ జిల్లా సాధన కోసం బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గం బంద్ విజయవంతం అయింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన బందు సంపూర్ణంగా విజయవంతమైంది.

వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బందుకు మద్దతు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు బంద్ కు సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో డాక్టర్ రాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఎంపీటీసీ బెజ్జం సాయి , దశరథ నాయక్, ఉదయ భాస్కర్ గౌడ్, సంజయ్, షోయబ్ , ఆటో యూనియన్ అధ్యక్షులు వాజిద్, సుధాకర్, దుర్గయ్య , గౌస్, మదర్, అంజి, కోట శ్రీనివాసరావు, రవి నాయక్ ,మాడుగుల శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు