మిర్యాలగూడ కు త్వరలో కేటీఆర్ రాక..!
మిర్యాలగూడ కు త్వరలో కేటీఆర్ రాక..!
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.
ఆదివారం పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మినీ రవీంద్ర భారతి, వైకుంఠ ధామం, సంత్ సేవలాల్ భవన్, మహాత్మ జ్యోతిబాపూలే భవనం, అంబేద్కర్ భవన నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ వెంకటేశ్వర రావుతో కలిసి పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ మొదటి వారంలో మిర్యాలగూడ నియోజకవర్గం పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిగిలి ఉన్న నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ రావు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ అశోక్ రెడ్డి, రవీందర్ నాయక్, ఎమ్మార్వో గణేష్, శ్రీ సాయి లక్ష్మి, ఏఈ రాంబాబు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ALSO READ :










