Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎన్నిక ఏకగ్రీవం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఫోర్ లీడర్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎన్నిక ఏకగ్రీవం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఫోర్ లీడర్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీకే ఉంది.

మునిసిపల్ చైర్మన్ గా తిరునగరు భార్గవ్ ఉన్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నిక అనివార్యమైంది. కాగా సోమవారం ఆ పార్టీ కౌన్సిలర్ లు అంతా స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమై
ఫ్లోర్ లీడర్ గా మహమ్మద్ ఇలియాస్ ఖాన్ ను ఎన్నుకున్నారు.

మిర్యాలగూడ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లమోతు భాస్కర్ రావు, అద్యక్షతన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అశోక్ నగర్ (వార్డ్-23) కౌన్సిలర్ మహమ్మద్ ఇలియాస్ ఖాన్ ని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్, మాజీ ఎంఎల్ఏ తిప్పన విజయసింహ రెడ్డి, సీనియర్ నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, కౌన్సిలర్లు బల్లెం దేవకమ్మ అయోధ్య, తలకోల సుజాత, మాలోతు రాణి, కుర్ర చైతన్య, సాదినేని స్రవంతి శ్రీనివాస్ రావు, తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, రమావత్ కమ్లి భిమ్లా నాయక్, బిఆర్ఎస్ నాయకులు తలకోల శ్రీధర్ రెడ్డి, బొడ్డు నంద కిషోర్, మన్నెం శ్రీనివాస రెడ్డి, షోయబ్, లక్ష్మయ్య, మలావత్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.

ALSO READ : 

TG Govt : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..!

BIGBREAKING: మిర్యాలగూడలో సంచలనం.. మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం..!

LPG GAS : పేదలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎంతంటే..?