మిర్యాలగూడ : నాలుగిళ్లలో చోరీ.. బంగారం నగదు అపహరణ

మిర్యాలగూడ : నాలుగిళ్లలో చోరీ.. బంగారం నగదు అపహరణ

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో భాగ్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో గురువారం రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. భాగ్యనగర్ కాలనీలోని భాస్కర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి , గంగాధర్, సైదులు ఇళ్లలో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

 

ఆరు తులాల బంగారం ,రెండు లక్షల అరవై వేల రూపాయల నగదు తో పాటు 50 వేల రూపాయల విలువైన డాలర్స్ దొంగిలించారు.

 

ALSO READ :

1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

 

 

దొంగలు పడిన ఇళ్ళలో ఎవరూ లేకపోవడంతో రాత్రి రెండు గంటల తర్వాత చోరీ చేసినట్లుగా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. నాలుగు ఇళ్లకు కూడా వంటగది డోర్ తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు.

 

శుక్రవారం సంఘటన స్థలాన్ని డిఎస్పి వెంకటగిరి పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఒకరి నివాసంలో ఉన్న సిసి కెమెరాలు కూడా పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.