Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : విద్యుత్ షాక్ తో ఇద్దరి కార్మికులకు గాయాలు..!

విద్యుత్ షాక్ తో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ లో చోటుచేసుకుంది.

Miryalaguda : విద్యుత్ షాక్ తో ఇద్దరి కార్మికులకు గాయాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

విద్యుత్ షాక్ తో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ లో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీనివాస్ నగర్ లోని రాయపూడి లోకనాథం యొక్క వెంచర్లో కరెంట్ లైన్ లాగడం కోసం
ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఉప్పల శ్రీనివాస్ పదిమంది వర్కర్స్ ను వారి యొక్క సూపర్వైజర్ హరీష్ ఆధ్వర్యంలో పని చేయిస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ ఆర్టిజెంట్ ఆవుల కృష్ణ ద్వారా ఎల్సి తీసుకొని పనిచేస్తున్నారు. మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో ఆవుల కృష్ణ కాంటాక్ట్ చేసే వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎల్సి రిటర్న్ చేయడం జరిగింది. అట్టి సమయంలో ఎలక్ట్రికల్ పోల్ పైన పనిచేస్తున్న ఇద్దరు వర్కర్స్ రూబెల్ హుస్సేన్, అస్త్రపుల్ మియా ఇద్దరికీ విద్యుత్ షాక్ తో కింద పడగా గాయాలయ్యాయి.

వీరు వెస్ట్ బెంగాల్ చెందిన వారు. వారిని జీవి హాస్పిటల్ నందు చికిత్స చేస్తున్నారు. ఇట్టి విషయమై తగు చర్య నిమిత్తం ఉప్పల శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు