మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆర్థిక సహాయం
మాడ్గులపల్లి , మనసాక్షి:
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలోని బొమ్మకల్లు గ్రామానికి చెందిన కొమ్ము జానయ్య ఆటోప్రమాదంలో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు బొమ్మ కల్లు గ్రామానికి చేరుకొని కొమ్ము జానయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మృతుడు జానయ్య కుటుంబసబ్యులకు ఎమ్మెల్యే భాస్కర్ రావు రూ10వేలు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మారుతి వెంకట్ రెడ్డి రూ.5వేలు, స్థానిక ఎంపిటిసి, ఎంపిపి పోకల శ్రీవిద్యారాజు రూ.5వేలు మొత్తం రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాడ్గులపల్లి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబాయ్యతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.











