Miryalaguda : విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Miryalaguda : విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం భోజనం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన మెనూ విధానాన్ని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు.
అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలలో ఉండే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచారని అన్నారు.
2008 తర్వాత మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు అండగా ఉండే నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులను అందరినీ భవిషత్తు భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో నూతన మెనూ ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు.
విద్యార్థులు అందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచిగా చదువుకొని మన ఊరికి మన ప్రభుత్వానికి కీర్తిని పెంచాలని అన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ విషయంలో ఎలాంటి అవసరాలు ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu : రైతులకు డబుల్ బొనాంజ.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!
-
Gold Price : పసిడి పతనం.. భారీగా రూ.9800 తగ్గిన ధర, తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా రూ.7500.. వారికి మాత్రమే, లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేస్తే ప్రోత్సాహం..!









