హుజూర్ నగర్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

హుజూర్ నగర్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

నల్గొండ , మనసాక్షి: ఏపూరి సోమన్న పై టీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులు చేశారని నల్గొండ లోని ఎన్జీ కళాశాల ముందు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దిష్టిబొమ్మ ను వైఎస్ఆర్ టిపి ఆద్వర్యంలో దహనం చేయడం జరిగింది.

ALSO READ : BREAKING : ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్.. ముగ్గురి అరెస్ట్

ఈ సందర్భంగా వైఎస్ఆర్ టిపి నాయకులు పర్వతం వేణు మాట్లాడుతూ హుజూర్ నగర్ లో జరిగిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్ షర్మిలమ్మ బహిరంగ సభలో ఏపూరి సోమన్న… ఎమ్మెల్యే సైదిరెడ్డి పై విమర్శలు చేశాడనే ఉద్దేశంతో ఏపూరి సోమన్న పై టీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. శాంతియుతంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రజల్లో వస్తున్న అశేష ఆదరన చూసి తట్టుకోలేక టిఆర్ఎస్ భౌతిక దాడులు చేస్తుందని అన్నారు.

ALSO READ : రచ్చబండకు తరలి వెళ్ళిన కిసాన్ కాంగ్రెస్

తక్షణమే హుజూర్ నగర్ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడితే రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ టిపి నాయకులు ప్రతిఘటించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంగినపల్లి కృష్ణ కట్ట రజనీకాంత్, మేడి అశోక్ , నామ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.