ఆ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఆ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
( మన సాక్షి , మహబూబాబాద్ )
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అనిచిత అన్చిత వ్యాఖ్యలు చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని అందులో పేర్కొన్నారు. అనంతరం రోడ్డుపై నిరసన తెలుపుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన అనుచ్ఛత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని డోర్నకల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు.
అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించడం జరిగింది. రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అన్ని మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది.









