Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

JanaReddy : జానారెడ్డి ముఖ్య అనుచరుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ..!

JanaReddy : జానారెడ్డి ముఖ్య అనుచరుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ..!

మన సాక్షి, హైదరాబాద్ :

మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు జానారెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వెళ్లారు. వారిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జానారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకొని ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్ళినట్లు సమాచారం. కానీ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా జానారెడ్డి తన ముఖ్య అనుచరుడు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు సమాచారం. సామాజిక వర్గాల నేపథ్యంలో శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని ఆయన తెలిపినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో చేపట్టే అవకాశం ఉందని జానారెడ్డికి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది.

MOST READ : 

  1. District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!

  2. Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి.. ఎందుకంటే..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  5. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు