మోడీ కుట్రలను తిప్పి కొట్టాలి, కె.సి.అర్ కు పట్టం కట్టాలి

మోడీ కుట్రలను తిప్పి కొట్టాలి, కె.సి.అర్ కు పట్టం కట్టాలి

అడ్డగూడూరు, మనసాక్షి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం పరిధిలోని చౌళ్ళరామరం గ్రామంలో 11కోట్ల25లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వేర్ హోసింగ్ గోదాములను ప్రారంభించిన మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. ఎం.పి బడుగుల లింగయ్య యాదవ్ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్కు,  మార్ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి.

అనంతరం ఏర్పాటు చేసిన అడ్డగూడూరు మోతూకూర్ మండలాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డి లు మాట్లాడుతూ ఆంధ్రోళ్ళకి కేసీఆర్ అంటే గిట్టదు అని ప్రచారం చేసిన వాళ్లకు చేoపపెట్టు లాగామొదటగా ఆంధ్రనుండే బి.అర్.ఎస్ లో చేరినరు.. ఆంధ్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వం మాకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. భారత దేశంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఉన్న రాష్ట్రలలో మొదటి స్తానం లో ఉంది తెలంగాణ 40,000 చెరువులను పునరుద్ధరించి నీటి ఉటగా మార్చింది బి.అర్.ఎస్
కేసీఆర్ పరిపాలనలో మాత్రమే సాధ్యం
కేసీఆర్ అద్భుతమైన నిర్మాణం చేస్తున్నాడు.

అని మిగతా రాష్ట్రంల మంత్రులు ముఖ్యమంత్రులు కితాబు ఇస్తున్నారు. 25లక్షల మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధి కల్పించింది కేసీఆర్.
మోడీ 15 లక్షల రూపాయలను దేశ ప్రజలందరికీ కాతా లో వేస్తాన్నాడు. మోడీ బయటి దేశలలో ఉన్న నల్ల ధనం తీసుకొస్తా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు ఎక్కడ తేలే మోడీ వి అన్ని దొంగ మాటలే.గుజరాత్ ప్రజల 25 ఏళ్లుగా పాలిస్తుంది బీజేపీ అక్కడ ఉచిత కరెంటు లేదు ,2000 పిన్షన్ లేదు,, అని అక్కడి రైతులు మొత్తుకుంట న్నారు.

కేసీఆర్ పేరంటే నే మోడీకి మంట తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో కి నెట్టాలని ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పని చేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే స్థాయి కి తెలంగాణ వచ్చింది. కేవలం 15 రోజులలో పరిశ్రమలకు అనుమతులు లభిస్తుంది. కాబట్టే పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. తెలంగాణ లో ఎక్కడ చూసినా సేద్యం చేస్తూ జీవిస్తున్నరు ఇంచు భూమి కాళీ లేకుండా
భారత దేశములో ఎక్కడ లేని విధంగా రైతుకు నీళ్లు కరెంట్ పెట్టుబడి ఇచ్చి రైతు కు అండగా నిలిచిన వ్యక్తి కేసీఆర్. వరి ఆంద్ర లో 38లక్షా ల ఎకరాలుతెలంగాణ లో 68 లక్షల ఎకరాలలో సాగు ఐనది
రైతాంగానికి చేయూత నిష్తే ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి అన్నదాతలు చేరుకుంటారు
ప్రధాని మోడీ రైతుల ఆదాయాన్ని 2022 వచ్చే నాటికి రెండతలు వచ్చే విధంగా చేస్తాన్నాడు.కానీ చేయలేదు.మోసం చేసిండు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ నికి అనుసంధానం చేస్తా అని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిండు కానీ చేయలే
ధాన్యం కొనాల్సింది కేంద్రం, కొనను అంటే మా రైతులు నష్టపోవద్దని కేసీఆర్ కొని రైతులను కాపాడిండు
మోడీ తెలంగాణ లో పోటి చేస్తున్న అని అంటున్నారు.

అంట.రా వచ్చి పోటీ చేస్తే మిమ్మలి ఒడిస్తాంఇంటికి పంపుతాం. రాష్ట్ర ల పొట్ట గొట్టి నిధులు ఇవ్వకుండా మోడీ పైశాచికంగా వువవహరిస్తున్నాడు మోడీ బి.జె.పి కుట్రలను తిప్పి కొట్టి మల్లి కె.సి.అర్ కు పట్టం కట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూర్ మోతుకూర్ మండల పార్టీ అధ్యక్షులు కోమ్మిడి ప్రభాకర్ రెడ్డి , పొన్నబోయిన రమేష్ , మోతుకూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ యాకూబ్ రెడ్డి , ఎం.పి. పి లు దర్శ నాల అంజయ్య, రచ్చ కల్పన ,జెడ్పి.టి.సి లు శ్రీ రాముల జ్యోతి, గోరు పల్లి శారద ,పి.ఏ.సి.ఎస్ చైర్మన్లు పొన్నాల వెంకటేశ్వర్లు, కంచర్ల అశోక్ రెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీపి రెడ్డి మేఘ రెడ్డి ,చిప్పలపల్లి మహేంద్ర నాధ్ ,దైద పురుషోత్తం రెడ్డి, శ్రీ రాముల అయోధ్య ,చౌ గొని సత్యం ,కుకునూరి వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎం.పి. టి.సి లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు