NALGONDA : ప్రభుత్వ ఆసుపత్రికి ఇంప్లాంట్స్ సరఫరా టెండర్లలో గుత్తేదారు చక్రం..!
NALGONDA : ప్రభుత్వ ఆసుపత్రికి ఇంప్లాంట్స్ సరఫరా టెండర్లలో గుత్తేదారు చక్రం..!
నల్లగొండ, మన సాక్షి:
నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో రోగులకు సరఫరా చేసి ఇంప్లాంట్స్ సరఫరా చేసి గుత్తేదారు ఎంపికను అక్కడ పనిచేసే సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు తనకు నచ్చిన ఓ గుత్తేదారు కి టెండర్ దక్కేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
సీనియర్ అసిస్టెంట్ స్థాయి అండతో టెండర్లు వేసే రోజు సదరు గుత్తేదారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికారుల ఛాంబర్ లోనే ఉండి వేరే వాళ్ళు వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.
దీనిపై ఆరోజు సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తే అక్కడ ఏం జరిగింది అనే విషయాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కోణంలో ఉన్నత స్థాయి అధికారులు పరిశీల చేయాల్సిన అవసరం ఉంది.
టెండర్ల ప్రక్రియలో కేవలం ముగ్గురు మాత్రమే పాల్గొనేలా చేసి అందులో ఆధిపత్యం ఉన్న సదరు వ్యక్తి టెండర్ దక్కించుకోవడానికి మార్గం సుగమం చేసుకునేలా కసరత్తు జరిగినట్లు తెలిసింది.
రేపో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఈ టెండర్లను ఓపెన్ చేయనున్నారు. పూర్తి నిబంధన లు పాటించిన గుత్తేదారులకు మాత్రమే టెండర్ దక్కేల చూడాలని ఇతర గుత్తేదారులు వాపోతున్నారు.
LATEST UPDATE :
- తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
- Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
- BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!
- అమృత్ పథకం టెండర్లలో అవినీతి.. దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ..!
- ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!









