ములుగు :  నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

ములుగు :  నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

వాజేడు / వెంకటాపురం, మన సాక్షి:

ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సి ఐ కె శివప్రసాద్ ఈ వివరాలును వెల్లడించారు .

 

ప్రభుత్వ నిషేధిత సి పి ఐ మావోయిస్టు అగ్ర నాయకులు దళ సభ్యులు మరికొంతమంది వాజేడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మిషన్లు తగలబెట్టి అటుగా వచ్చే పోలీసు పార్టీని ల్యాండ్ మెన్ ఏర్పాటు చేసి చంపాలని కుట్ర పలుతున్న పన్నుతున్నారని సమాచారం.

 

రావడంతో పోలీసు సిఆర్పిఎఫ్ బలగాలతో వాజేడు నుండి గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న దారిలో తనిఖీ నిర్వహించారు ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఒక వెూటార్ సైకిల్ పై ఒక బస్తా బ్యాగు ప్రెటోల్ టీంతో గుమ్మడి దొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తు పోలీసు పార్టీని చూసి పారిపోవలని ప్రయత్నించారు .

 

గమనించిన పోలీసులు వారిని ఆదుపులో తీసుకోని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు కనిపించడంతో ఇద్దరు మనుసులను పిలిపించి వారి సమక్షంలో విచారణ నిర్వహించారు.

 

పుల్లూరి నాగరాజు, వావిలాల నర్సింగరావు, ఏంపెళ్లి జాగావా, కంబాలపల్లి గణపతి అనే నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు.