Mp Missing : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

కుల్కచర్ల,  మన సాక్షి:

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని డిసిసి ఉపాధ్యక్షులు బులుసాని భీమ్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కనిపించలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఎంపీగా గెలిచి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఏ ఒక్క రోజైనా కుల్కచర్ల మండలానికి రానీ ఎంపీ రంజిత్ రెడ్డి,  ఎంపీ నిధులనుండి కుల్కచర్ల మండలానికి ఒక్క రూపాయి కేటాయించని లేదని పేర్కొన్నారు.

 

ALSO READ :

  1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
  2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
  3. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  4. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!

 

ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ భీమ్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ , మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్,సాల్విడ్ గ్రామ నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాస్ హనుమంతు, ముజాహిద్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్ఫుద్దీన్,రోహిన్,చిన్న పులింగ వెంకటేష్, కాకి ఆనందం, ఘనపూర్ అధ్యక్షులు భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.