వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపురం , మన సాక్షి.

మలుగు జిల్లా వెంకటాపురం మండలం గత మూడు రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరిగి వాగులు,చెరువులుకు భారీగా వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంకటాపురం మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి జిన్నెలవాగు,బోధపురం బ్రిడ్జి దగ్గర వరద పరిస్థితిని తెలుసుకొని మండల అధికారులకు పలు సూచనలు చేశారు.

 

ఆలుబాక లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రణాళిక బద్ధమైన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉండాలని,నిత్యవసర సరుకులు అవసరమైన టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు.

 

ALSO READ :

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

3. Godavari : గోదావరి ఉద్రుతిని పరిశీలించిన అధికారులు

4. Godavari | పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

 

వాగులు,చెరువుల దగ్గర చేపల వేటకు ఈత కొట్టడానికి వెళ్లొద్దని వరద ముంపు ప్రాంతాల్లో అత్యవసరంగా పర్యటించడానికి బోటును కూడా తెప్పించామని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నారని పశువుల కాపరులు గోదావరి పాయ దాటి వెళ్లొద్దని మండల అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు.

 

కలెక్టర్ మండల పర్యటనలో స్థానిక జడ్పిటిసి పాయం.రమణ,తహసిల్దార్ అంటి.నాగరాజు,స్పెషల్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి, ఎంపీడీవో అడ్డూరి.బాబు,సిఐ కే.శివప్రసాద్, ఎస్సై కే. తిరుపతిరావు, సర్పంచులు పాల్గొన్నారు