Godavari | పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

గోదావరి పాయకు చొచ్చుకు వస్తున్న గోదావరి వరద నీరు

Godavari | పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

గోదావరి పాయకు చొచ్చుకు వస్తున్న గోదావరి వరద నీరు

మంగపేట , మన సాక్షి

గోదావరి పరివాహక ప్రాంతంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీనికి తోడు సోమవారం నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది జీవనదులు సైతం పొంగిపొర్లుతున్నాయి. నది కి ఒక్కసారిగా వరదలు ముంచుకొస్తున్నది.

 

పూసూరు గోదావరి వంతెన వద్ద పరవళ్ళు తొక్కుతూ గోదావరి ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా మంగపేట మండలం లోని సమీపంలోని దొంగలోరే, వాగు సమీపంలో పొంగి పొర్లుతున్న వరద, గోదావరి నీరు బుధవారం, కమలాపురం పరిధిలో ఉన్న ఎర్ర వాగు పాయకు వరద నీరు రావడంతో, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తమయ్యారు.

 

ALSO READ : 

1. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

5. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

 

 

కమలాపురం సుమారు కిలో మీటర్ దూరంలో ఉన్న గోదావరి పాయ కు ఉదయం వరదనీరు చొచ్చుకురావడంతో, మేతకు తోలుకు వెళుతున్న పశువులు ను కాపాడు కునేందుకు గోదావరి లంకలకు మేతలకు వెళ్ళ కుండా యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

నురగలు కక్కుతూ కమలాపురం గోదావరి పాయకు కొత్తగా వరద నీరు రావడంతో పలువురు గోదావరి పాయ ఒడ్డుకి వెళ్లి తిలకించారు. భారీ వర్షాలతో బుధవారం ఆటంకంగా మారింది. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం మై జనజీవనం స్తంభించిపోయింది.

 

మబ్బులు కమ్మిన ఆకాశం తో పాటు, భారీ వర్షం సూచనలతో వాతావరణ శాఖ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి భయపడుతున్నారు. పల్లె ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. అనేక వాగులు వంకలు కొండలు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి.

 

ALSO READ : 

1. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!