మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ
మిర్యాలగూడ టౌన్ , మన సాక్షి:
శ్రీరామనయమి పండుగ సందర్భంగా మిర్యాలగూడ మున్సిపల్ ఫోర్ లీడర్ భక్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ,కౌన్సిలర్ గంధం రామకృష్ణ, కాండ్రాతి రాజ పాల్గొని శుక్రవారం చీరల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా శ్రీరాములవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. బిఎల్ఆర్ గత ఎనిమిది సంవత్సరాల నుండి పేద మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు .
మాకు ఎప్పుడూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో ముందుకు వెళ్లాలని మనకు చేతనైన సహాయాలు దానార్తులకు వస్త్ర దానాలు భోజనానికి ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానాలు చేయాలని అలా చేసినప్పుడే మానవ జన్మ సార్ధకత వస్తుందని, బిఎల్ఆర్ నాయకుడిగా రావడం మిర్యాలగూడ ప్రజలు చేసుకున్న అదృష్టమనిఅన్నారు. వారు వేసవికాలంలో పేద ప్రజల కోసం చలివేంద్రాలు., పెరుగన్నం పంపిణీ ,అదేవిధంగా మెగా హెల్త్ క్యాంపులు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలు, పేదింటి ఆడపడుచుల కోసం శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు, బి ఎల్ ఆర్ మ్యారేజ్ కిట్, అదేవిధంగా యువత ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ల పంపిణీ కార్యక్రమాలు చేశారని అన్నారు .
అదే విధంగా ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను ఏవిధంగా కాపాడాలి అని ఆలోచన చేస్తూ ఆనందయ్య గారిని మిర్యాలగూడ కు తీసుకువచ్చి నియోజకవర్గం మొత్తం గడపగడపకు ఆనందయ్య కరోనా మందును పంచిన ఘనత మన బి ఎల్ ఆర్ దన్నారు . అదేవిధంగా పేద ప్రజల కోసం ఆరోగ్య రక్ష వాహనాన్ని తీసుకువచ్చి ఉచితంగా పేషెంట్లను హాస్పటల్లో వద్దకు తీసుకు వచ్చే కార్యక్రమం అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో చివరి మజిలీ అయినా వైకుంఠయాత్ర సజావుగా సాగటం కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన చేసి గత 5 సంవత్సరాల క్రితమే బి ఎల్ ఆర్ బ్రదర్స్ వైకుంఠ రథం ను తీసుకువచ్చారని అన్నారు .
అదేవిధంగా పేద ప్రజల కోసం బి ఎల్ ఆర్ గారి తండ్రి ఈశ్వర్ రెడ్డి పేరు మీద ఈశ్వర బంధం ఈ కార్యక్రమం ఉద్దేశం ఎవరి ఇంట్లోనైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో ఉండి పార్ధివ దేహాన్ని చూడటానికి వచ్చిన బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని అని అన్నారు.









