Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణనల్గొండరాజకీయం

మునుగోడు లో బిజెపికి మూడో స్థానమే –  జూలకంటి రంగారెడ్డి

మునుగోడు లో బిజెపికి మూడో స్థానమే –  జూలకంటి రంగారెడ్డి

నిజమైన ‘420’లు కోమటిరెడ్డి బ్రదర్స్

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 14, మన సాక్షి: ప్రమాదకరమైన బిజెపిని ఓడించడమే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమని అందులో భాగంగానే మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశంలో ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఎన్నిక ఉండాలనే భావనతో కేంద్ర బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అందులో భాగంగానే ప్రజల ఆలోచనలు మళ్లించేందుకు మత విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైనా ఓ సైదాంతికంగా పోరాటం సాగిస్తుందని దేశానికి ప్రమాదకరంగా మారిన బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కమ్యూనిస్టులపై రాజగోపాల్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని నిజంగా 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయాడని విమర్శించారు. నిజమైన 420 లు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ధ్వజమెత్తారు.

నమ్మిన కాంగ్రెస్ పార్టీని, కన్న తల్లిగా చెప్పుకునే సోనియాగాంధీని మోసం చేసి ఆ పార్టీని నాశనం చేసే బిజెపి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశారని ఆ వ్యాఖ్యలు అతనికే వర్తిస్తాయని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, మునుగోడులో బిజెపికి మూడో స్థానంమే పరిమితమవుతుందని జోష్యం చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మాటలను మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలేరని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, పాదురి శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మక్తాల లింగస్వామి, పాపి రెడ్డి, నంద్యాల కృపాకర్ రెడ్డి, పల్లా బిక్షం తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు