రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ రానివ్వము – మంత్రి జగదీశ్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ రానివ్వము
కాంగ్రెస్ ,బీజేపీ లకు ఓటేస్తే మునుగోడు మళ్ళీ పదేళ్లు వెనక్కి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మునుగోడు, ఆగస్టు 12, మనసాక్షి : కాంగ్రెస్ , బీజేపీ లకు ఓటేస్తే మునుగోడు మళ్ళీ పదేళ్లు వెనక్కి పోతుందని, అభివృద్ధి జరగదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభ కోసం నారాయణపురం, చౌటుప్పల్ , మునుగోడు, మండల్లాలో పలు స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను, ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మునుగోడు కు వస్తున్నారని అన్నారు. అధికార టిఆర్ఎస్ ని గెలిపించుకొని మునుగోడు ప్రజలు అభివృద్ధి కి పట్టం కడతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన అభివృద్ధి కొరకే బీజేపీ కి అమ్ముడు పోయి రాజీనామా చేశారని అన్నారు.
ALSO READ : భూతగాదాలతో యువకులపై గొడ్డలితో దాడి – latest news
రాజగోపాల్ రెడ్డి అనే అభివృద్ధి నిరోధకుణ్ణి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి కి డిపాజిట్ కూడా రానివ్వమని, తన సొంత వ్యాపారాల కోసం మునుగోడు ప్రజలను రాజగోపాల్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. మునుగోడు సభ ద్వారా బీజేపీ భoడారాన్ని బయటపెడతామని తెలిపారు. ప్రజలను పీక్కోని తింటున్న బీజేపీ లో చేరి, రాజగోపాల్ రెడ్డి చరిత్ర హిణుడిగా మిగిలిపోయాడని పేర్కొన్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, మునుగోడు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని,
రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా తరిమికొట్టాలి అన్నారు. మాకు పోటీయే లేదని, కాంగ్రెస్, బీజేపీ లు ప్రజా వ్యతిరేఖ పార్టీలు అన్నారు. నల్గొండ జిల్లా ఇంచార్జి, ఎం ఎల్ సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.