Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Murder : అప్పు ఎగ్గోట్టడానికి మహిళ దారుణ హత్య..!

Murder : అప్పు ఎగ్గోట్టడానికి మహిళ దారుణ హత్య..!

అక్రమ సంబంధం కలిగిన వారే నేరస్తులు

నల్లగొండ, మనసాక్షి:

ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆమె వద్ద నుండి లక్షల రూపాయలు అప్పు తీసుకొని అవి ఎగ్గొట్టడానికి మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన నార్కెట్పల్లి మండలం, ఔరవాణిలో జరిగినట్లు నలగొండ డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఔరవానికి చెందిన సిలువేరు లక్ష్మయ్య, ఇదే గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ దగ్గర 1,50,000 అప్పు తీసుకున్నాడు.

అలాగే నకిరేకంటి చంద్రమోహన్ ఇదే మహిళ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. వీరిద్దరికీ పిచ్చమ్మతో అక్రమ సంబంధం ఉన్నట్లు డిఎస్పి తెలిపారు అలాగే మూడో వ్యక్తి నారబోయిన అంజయ్య కూడా పిచ్చమ్మ వద్ద 40000 అప్పు తీసుకొని తిరిగి చెల్లించినా ఇవ్వలేదని పంచాయతీ పేడితే మళ్లీ 40000 ఇచ్చినట్లు తెలిపారు. ఈ అప్పులను తీర్చాలని ఆమె ఇద్దరిపై ఒత్తిడి చేసి పరువు తీయడంతో ఆమెను ఎలాగైనా చంపాలని సిలివేరు లక్ష్మయ్య. చంద్రమోహన్ నారబోయిన అంజయ్య కుట్ర పన్ని పిచ్చమను నకరికంటి అచ్చయ్య బావి వద్దకు పిలిపించుకొని ముగ్గురు కలిసి కట్టెలతో బాధి చంపినట్లు డిఎస్పి తెలిపారు.

అనంతరం శవం మీద ఉన్న బంగారు పుస్తెలతాడు లక్ష్మీదేవి బిళ్ళను తీసుకొని నీరు లేని బావిలో పడవేసి సాక్షాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు డిఎస్పి తెలిపారు . మృతురాలి మేనల్లుడు బంధువుల అనుమానం మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేశామని డిఎస్పి తెలిపారు. నేరాలు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

RELATED NEWS : 

BREAKING : బైక్ ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!

Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!

Dubbaka : మహిళా అదృశ్యం..!

Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

మరిన్ని వార్తలు