Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణనల్గొండ

మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

నల్గొండ, మనసాక్షి : తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతుంది. నల్గొండ జిల్లాలో అతిపెద్ద మధ్యతరహా ప్రాజెక్టులు మూసి నిండు కుండలా మారి కనువిందు చేస్తుంది. సోమవారం ఉదయం ప్రాజెక్టులో 3, 7, 10 వ నెంబర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1242. 79 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 1999.74 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.61 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్లు ఎత్తడంతో ప్రజలు చూసేందుకు తరలివస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

1. కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే చేరిక

2. ఫ్లాష్ .. ఫ్లాష్ … రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

3. మద్యం తాగి వివాహ వేదిక మీదికి వరుడు, మరదలు చేసిన పనికి అంతా షాక్ (వీడియో)

మరిన్ని వార్తలు