వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు – latest news

వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు

తాండూర్, సెప్టెంబర్ 19, (మన సాక్షి): జల్సాల కోసం సరదాగా ప్రారంభించిన దొంగతనం అలవాటుగా మార్చుకున్నారు. ముగ్గురు స్నేహితులు. ముఠాగా ఏర్పడి పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడ్డారు ఎత్తుకొచ్చిన బైకులను సొంత ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకున్నారు అనుకోకుండా పోలీసుల తనిఖీల్లో పట్టుబడి కటకటాల పాలయ్యారు.

నిందితులతో పాటు వాహనాలను కొనుగోలు చేసిన వారు కూడా ఈ కేసులో నిందితులు కావడం విశేషం. దాదాపు 20 బైకులు రెండు ఆటో లను దొంగిలించిన ముగ్గురు స్నేహితుల గుట్టును పోలీసులు రట్టు చేశారు . సోమవారం తాండూర్ డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.

ALSO READసూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన పురాతన రాక్షస గుళ్ళు – latest news

వికారాబాద్ జిల్లా యాలాల్ మండల్ కమలాపూర్ గ్రామానికి చెందిన బోయిన శ్రీకాంత్ మేధారి భాస్కర్ మ్యాటర్ శివాలు స్నేహితులు వీరంతా హైదరాబాద్లో ఆటో డ్రైవింగ్ చేసేవారు ఆటో డ్రైవింగ్ తో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలను ఎంచుకున్నారు.

ఈ క్రమంలోని బైకులను దొంగతనం చేసి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు హైదరాబాదులోనే పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పార్కింగ్ సెంటర్ల నుంచి బైకులను తాళాలు విరగొట్టి డూప్లికేట్ తాళాలతో ఎత్తుకెళ్లి తక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. మరొకవైపు ముగ్గురు స్నేహితులు చోరీ చేసిన బైకులను పెద్దములు మండలానికి చెందిన బోయిని ఆనంద్ కు (9) బైకులు యాలాల మండలం అక్కంపల్లి గ్రామం కి చెందిన తుప్పలి మహిపాల్ కు(4) బైకులను విక్రయించారని తెలిపారు. చోరీ చేసిన బైకులు అని తెలిసి తెలిసి వాహనాలను కొనుగోలు చేసినందుకు నిందితులతో పాటు వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు .

ALSO READ : వెలసిన మావోయిస్టు పోస్టర్లు

చోరీ చేసిన బైకులు ఆటోల విలువ సుమారు రూపాయలు 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కేసు చేదులను ప్రతిభను కనబరిచిన ఎస్ఐ అరవింద్ కానిస్టేబుల్ను అభినందించారు వారికి తగిన రివార్డులను అందిస్తామన్నారు ఈ సమావేశంలో తాండూర్ డిఎస్పి జి శేఖర్ గౌడ్ సిఐలు రాజేందర్రెడ్డి, రాంబాబు ఎస్ఐ అరవింద్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.