Telangana : రేవంత్ కు నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతోనే డేంజర్..!

నల్గొండ జిల్లా పార్టీ లో జోష్ నెలకొన్నదనీ ఓటమిపై బాధ పడొద్దుఅని రెట్టింపు ఉత్సాహం తో పోరాటం చేద్దామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో జరిగిన నల్గొండ పార్లమెంట్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Telangana : రేవంత్ కు నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతోనే డేంజర్..!

నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందింది..!

చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం, మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం.

కృష్ణారెడ్డి ఎంపీగా గెలుస్తున్నాడు.

నల్లగొండ పార్లమెంటరీ సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

నల్లగొండ, మన సాక్షి.

నల్గొండ జిల్లా పార్టీ లో జోష్ నెలకొన్నదనీ ఓటమిపై బాధ పడొద్దుఅని రెట్టింపు ఉత్సాహం తో పోరాటం చేద్దామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో జరిగిన నల్గొండ పార్లమెంట్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మేము ఇచ్చిన ఉద్యోగాల కు సీఎం రేవంత్ ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతున్నాడు అని విమర్శించారు
ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయామని
నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందనీ రియాబట్టారు.కేసీఆర్ ఉన్నన్నీన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణయుగం అయిందనీ. నల్గొండ లో చివరి బూములకు కూడా నీల్లిచ్చిన ఘనత కేసీఆర్ దనీ.ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందాం అని పిలుపునిచ్చారు.

ఉమ్మడి నల్గొండ లో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినామని, కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారనీ, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మళ్ళీ ఉల్లల్లో బోర్లు బండ్ల మోతలు వినబడుతున్నాయిఅని రైతుల రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ మోసం చేసిందనీ ఇవ్వాళ బ్యాంక్ లు అన్నదాతలను పిడిస్తున్నాయ్ అని
రైతుబందు ఇవ్వకుండా మోసం చేశారన్నారు..

 

కోమటిరెడ్డి అన్నదాతలను చెప్పుతో కొడతాం అంటాడు.. ఇంకో మంత్రి ఉత్తమ్ రైతు బంధు దుబారా అంటున్నాడు. ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలి. ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలి. నల్గొండ ఎంపీనిని గెలుస్తాం
రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న అంటున్నాడు. నువ్వేమైన జేబు దొంగవా అని అడుగుతున్న.
రేవంత్ కు నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ నేతలతోనే డేంజర్ ఉన్నది.

నాయనా అది ముందు చూసుకో ని పార్టీలోనే ఎక్ నాథ్ షిండే లు వున్నారు రేవంత్ జాగ్రత్తగా ఉండుపొంకణాల రెడ్డి రేవంత్ రెడ్డి. 420 హామీలు నెరవేర్చే దాకా నిన్ను వదలం పోరాటం చేస్తాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీ లోకి పోయే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి కేస్ లు తప్పించుకునెందుకు బీజేపీ లో చేరుతాడు. అన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదేశ్రెడ్డ. ఎంపీ లింగయ్య యాదవ్.ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.