Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : లతీఫ్ షా దర్గా.. ప్రేమానురాగాలకు ప్రతీక, దర్గా పూర్వ చరిత్ర తెలుసా..!

Nalgonda : లతీఫ్ షా దర్గా.. ప్రేమానురాగాలకు ప్రతీక, దర్గా పూర్వ చరిత్ర తెలుసా..!

నలగొండ, మన సాక్షి :

ప్రేమ అనురాగాలకు ప్రతీకగా నిలిచింది. నల్లగొండ పట్టణంలోని సయ్యద్ హజరత్ లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ..భక్తులకు కొంగు బంగారంగా పేరుగాంచింది. ఈ దర్గాకు సంబంధించిన ఉర్సు ఈ సంవత్సరం రానే వచ్చింది. ఈనెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఏ కాకుండా ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి భక్తులు రానున్నారు. భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన ఈ దర్గా నల్గొండ పట్టణంలో నడిబొడ్డున గల గుట్టమీద ఉంది కనుక ఈ గుట్టకు లతీఫ్ సాబ్ గుట్ట అని పేరు ఉన్నది.

దర్గా నేపథ్యం.. పూర్వ చరిత్ర : 

క్రీస్తు శకం 950 సంవత్సరంలో ఇరాన్ దేశానికి చెందిన హజరత్ సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి మత బోధనలు చేయడానికి నల్గొండ జిల్లాలోని జిల్లా కేంద్రంలోని గుట్టపైకి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే భక్తులకు బోధనలు చేస్తూ వారికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఆయన తన మహిమల ద్వారా బాగు చేసేవారు.

ఈ విధంగా అందరికీ మంచి చేస్తూ ఆయన అక్కడే చనిపోవడంతో సమాధి కూడా గుట్టపైన కట్టారు .ఆ సమాధి ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం దర్గా అని పిలుస్తున్నారు .లతీఫ్ సాబ్ మరణానంతరం ఆయన అన్నా కుమారులు కూడా గుట్టపైనే బోధనలు చేస్తూ అందరికీ మంచి చేసేవారు.

భక్తుల కొంగుబంగారంగా లతీఫ్ సాబ్ దర్గా : 

భక్తుల కొంగు బంగారంగా లతీఫ్ దర్గా పేరుగాంచింది. గుట్ట ఎక్కాలి అంటే మొత్తం వెయ్యి మెట్ల వరకు ఉన్నాయి . మెట్లు ఎక్కలంటే కనీసం ఒక గంట
సమయం పడుతుంది .దిగేటప్పుడు సులువు గనుక అరగంటలో కిందికి దిగవచ్చు. ఈనెల 17వ తేదీన ఉత్సవాలను ప్రారంభించడానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి ,ఎస్పీ శరత్చంద్ర పవర్ లు వచ్చారు .

శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. గుట్టను ఎక్కలేని వారు మెట్ల దగ్గరనే తమ మొక్కులను చెల్లించుకోవచ్చు. మూడవరోజు ఆదివారం కావలి అనే సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమం నిర్వహించనున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన కావాలి బృందం ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆహ్లాదకరమైన వాతావరణం- లతీఫ్ షా ఉత్సవాలు

ప్రారంభం గనుక గుట్ట ప్రధాన ద్వారం వద్ద గల మైదానంలో రకరకాల దుకాణాలు గెలిచాయి. అందులో మహిళలకు సంబంధించిన గాజుల దుకాణాలు, మేక్ అప్ కు సంబంధించిన దుకాణాలు, మిఠాయి దుకాణాలు, మిక్చర్ దుకాణాలు, పిల్లల బొమ్మల దుకాణాలు , కొబ్బరికాయల దుకాణాలు ,అగరవత్తుల దుకాణాలన్నీ కూడా వెలిశాయి. వాస్తవానికి ఉర్సు నాలుగు రోజులపాటు జరిగిన నెలలపాటు దుకాణాలు ఉంటాయి.

ప్రతిరోజు మధ్యాహ్నం నుండి దుకాణాలు తెరవడం ప్రారంభిస్తారు రాత్రి 11:00 వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి . గుట్ట దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుని ఉంటుంది. భక్తులకు ఇబ్బందులు కలవకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాము .

ఎండి సమీవుల్లా ఖాద్రి- దర్గా మూతవల్లి

లతీఫ్ సాబ్ దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము నలువైపుల నుండి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కల్పించాము. గుట్టపై కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది .విద్యుత్ వీ సౌకర్యం కూడా 24 గంటలు ఉంటుంది వచ్చే భక్తులు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలి.

(Reporting : Soma Shekar, Nalgonda)

MOST READ : 

మరిన్ని వార్తలు