Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
నల్గొండ : ఉదయం బీఆర్ఎస్, మధ్యాహ్నం కాంగ్రెస్ , సాయంత్రం బిజెపి అంటడు ఆ నాయకుడు ..!
నల్గొండ : ఉదయం బీఆర్ఎస్, మధ్యాహ్నం కాంగ్రెస్ , సాయంత్రం బిజెపి అంటడు ఆ నాయకుడు ..!
నల్గొండ , మనసాక్షి :
ఉదయం బి.ఆర్.ఎస్ కు వస్తానని చర్చిస్తాడు.. మధ్యాహ్నం కాంగ్రెస్ లో ఉంటాడు .. సాయంత్రం బిజెపి అంటాడు.. అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం నల్గొండలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాట్లాడిన మాటలు యదావిధిగా..
- నిరుద్యోగులు నిరసన సభా కాదు అది కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ.
- సిగ్గు లేకుండా కేవలం బట్ట కాల్చి మీదేసే కార్యక్రమం.
- స్థిరత్వం , మతిస్థిమితం లేని మాటలు ,2004 నన్ను ఓడించిన అని చెప్పడం అసందర్భం.
- నా శిష్యుడు భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిండు.
- ఉదయం BRS కి వస్త అని చర్చిస్తడు , మధ్యాహ్నం కాంగ్రెస్ , సాయంత్రం బీజేపీ అంటడు.
- 5 ఎకరాల భూమి లేదంటడు మరి హైదరాబాద్ లోని విల్లాలు హైటెక్ సిటీ లోని ఆస్తులు ఎవరివి.
- వాళ్ళు ప్రారంభించిన ఉదయసముద్రం మేం పూర్తి చేస్తున్నాం.
- IT మంత్రి గా కోమటిరెడ్డి చేయలేనిది ఐటీ మంత్రి కేటీఆర్ సహకారం తో నేడు నల్గొండ కి ఐటీ టవర్ వచ్చింది.
- SRSP ద్వారా రెండు పంట లకి నీరు అందిస్తున్న ఘనత కెసిఆర్ ది.
- ఛత్తీస్ ఘడ్ లో దిగుబడి లేదు.
- 65 వేల కోట్లు రైతు బంధు ద్వారా ఇచ్చాం.
- ఎకరాకు 10 వేలు నష్టపరిహారం ఇస్తున్న ప్రభుత్వం దేశం లో ఎక్కడా లేదు.
- దుర్మార్గం గా నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారు.
- ఆత్మ పరిశీలన చేసుకోవాలా కాంగ్రెస్ నాయకులు.
- అధికారం కోసం అడ్డగోలుగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రం లోని సమస్యల పట్ల అవగాహన లేదు.
- కాంగ్రెస్ కి అధికారం ఇస్తే రాష్ట్ర కుక్కలు చింపిన విస్తరిలా అవుతుంది.
- బీజేపీ ప్రభుత్వ ఎన్ని ఇబ్బందిలు పెట్టిన అన్నింటా తెలంగాణ NO 1 గా ఉంది కేంద్రం ఇచ్చే అవార్డులే ఉదాహరణ లు.
- జాతీయ పార్టీ లకి అభివృద్ధి కనపడట్లే అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
- వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
- తెలంగాణ ప్రజల కి కెసిఆర్ పాలనే శ్రీ రామ రక్షణ.
- దళిత బందు 30 % కమిషన్ పై ముందస్తు గా హెచ్చరిక మాత్రమే చేశారు. ఆధారాలు లేవు.
- ఆధారాలు ఉంటే పార్టీ టికెట్ ఉండదు , పార్టీ బహిస్కరిస్తుంది.









