ఎన్నెస్పీ కాలువలో పడి వ్యక్తి మృతి

ఎన్నెస్పీ కాలువలో పడి వ్యక్తి మృతి

మేళ్లచెరువు,మనసాక్షి:

అర్ధరాత్రి బైక్ పై ప్రయాణిస్తూ అదుపు తప్పి ఎన్నెస్పీ కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాలను బట్టి

 

ALSO READ :

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

 

హుజూర్ నగర్ కు చెందిన షేక్ సాజిద్,కనగాల నవీన్ లు మేళ్లచెరువులో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి బైక్ పై వెళ్తూ అదుపుతప్పి మిట్టగూడెం వద్ద గల ఎన్నెస్పీ మేజర్ కాలువలో పడిపోయారు. ఘటనలో సాజిద్(26) అక్కడికక్కడే చనిపోగా,నవీన్ కు తీవ్రగాయాలయ్యాయి.

 

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నవీన్ ను హుజూర్‌నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతుని మేనమామ కుర్షీద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 

ALSO READ :

TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?