BREAKING : నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి..!

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా అందులో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న దాసరి హరిచందన బదిలీ ఆయ్యారు.

BREAKING : నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి..!

నల్లగొండ, మనసాక్షి.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా అందులో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న దాసరి హరిచందన బదిలీ ఆయ్యారు. ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా సి. నారాయణరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలను చేపట్టారు .ముందుగా నల్గొండ జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయనికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, కలెక్టరేట్ ఏ ఓ మోతిలాల్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా నూతన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

నూతన జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికిన వారిలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటర్శ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ భూమయ్య , పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు , జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మోతిలాల్, జిల్లా కలెక్టర్ సిసిలు ప్రసాద్, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : 

BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

BREAKING : చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన వారిని జైలుకు పంపింది..!