Narayanpet : పోలీసుల నాకాబంధి.. వాహనాలు సీజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు..!
ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద, జాజాపూర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం నారాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసులు ప్రత్యేక నాకాబంది నిర్వహించారు.

Narayanpet : పోలీసుల నాకాబంధి.. వాహనాలు సీజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద, జాజాపూర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం నారాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసులు ప్రత్యేక నాకాబంది నిర్వహించారు.
ఈ తనిఖీలలో వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 36 మంది వాహనదారులకు జరిమానాలు విధించగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 6 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ వంటి అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలో ఇటువంటి ప్రత్యేక నాకాబంది తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్ఐ సతీష్ రెడ్డి, దామరగిద్ద ఎస్ఐ నరేష్, ఎస్ఐ-2 గాయత్రితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.