Water Supply : 9 మండలాలు, 3 మున్సిపాలిటీలలో రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్..!
మిషన్ భగీరథ తాగునీటి మెయిన్ పైపులైన్ లీకేజీ కారణంగా శుక్రవారం తాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు అందోలు–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, కమిషనర్ తిరుపతి లు గురువారం ఒక ప్రకటన లో పేర్కోన్నారు.

Water Supply : 9 మండలాలు, 3 మున్సిపాలిటీలలో రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్..!
అందోలు, మన సాక్షి :
మిషన్ భగీరథ తాగునీటి మెయిన్ పైపులైన్ లీకేజీ కారణంగా శుక్రవారం తాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు అందోలు–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, కమిషనర్ తిరుపతి లు గురువారం ఒక ప్రకటన లో పేర్కోన్నారు.
పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలోని 90ఎంఎల్‌డీ డబ్లు్యటీపీ నుంచి రాయిపహాడ్ 1200కేఎల్ ఓహెచ్‌బీఆర్‌కు వేళ్లే 1100ఎంఎం డీఐ ట్రంక్ మెయిన్ పైపులైన్ లీకేజీ కారణంగా వాటికి మరమ్మత్తులను చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని వారు తెలిపారు.
ఈ పైపుౖలñ న్ లీకేజీతో అందోలు–జోగిపేట, మెదక్, రామయంపేట మున్సిపాలిటీలతో పాటు మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట్, మెదక్, హవేలీ ఘనపూర్, రామయంపేట్, నిజాంపేట్, శంకరంపేట–ఆర్, నర్సింగ్, అందోల్ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలకు నీటి సరఫరా జరగదని వారు తెలిపారు.
కావున ఆయా మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు స్థానికంగా ఉన్న బోరు వాటర్‌ను వినియోగించుకొవాలని వారు కొరారు. పైపులైన్ మరమ్మత్తులను చేపట్టిన తర్వాత నీటి సరఫరాకు ఏలాంటి ఇబ్బందుల్లేకుండా యధాస్థితికి తీసుకొచ్చిన తర్వాత నీటి సరఫరా జరిగే సమయాన్ని వెల్లడిస్తామని వారు తెలిపారు.