జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి బ్రహ్మం ఎంపిక..!

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ ఆలుకా జై హింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి బ్రహ్మం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి బ్రహ్మం ఎంపిక..!

చింతపల్లి, మన సాక్షి.

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ ఆలుకా జై హింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి బ్రహ్మం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బ్రహ్మం ఈనెల 8 నుండి 11వ తేదీ వరకు నిజాంబాద్ జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొననున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బాను నాయక్ పేర్కొన్నారు.

ALSO READ : నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!

ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారని వారు పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బ్రహ్మం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ కళాశాలకు వారి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలనన్నా రు. సందర్భంగా విద్యార్థి బ్రహ్మo ను కళాశాల సిబ్బంది చింతపల్లి మండలం ఎంపీపీ కోడూరు భవాని పవన్ కుమార్, జడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, కళాశాల సిబ్బంది తదితరులు ఆ విద్యార్థి కి అభినందనలు తెలియజేశారు.

ALSO READ : అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ లోకి ఎమ్మెల్యే బిఎల్ఆర్