తెలంగాణ – కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో.. నాటు సారా స్థావరాలపై దాడులు..!

తెలంగాణ - కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో గురువారం ఇరు రాష్ట్రాల పొలీస్ లు కలిసి దాడులు చెయ్యడం జరిగిందని తాండూర్ సీఐ అనంతయ్య తెలిపారు.

తెలంగాణ – కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో.. నాటు సారా స్థావరాలపై దాడులు..!

బషీరాబాద్, మన సాక్షి

తెలంగాణ – కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో గురువారం ఇరు రాష్ట్రాల పొలీస్ లు కలిసి దాడులు చెయ్యడం జరిగిందని తాండూర్ సీఐ అనంతయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలోని అడికి తాండా,మైల్వార్ తాండా, మైల్వార్, ఇస్మాయిల్ పూర్ లో ఎన్నికల నేపథ్యంలో నాటు సార తయారు జోరుగా తయారు అవుతుందన్న సమాచారం మేరకు దాడులు చేశామని అన్నారు .

నాటుసారా తయారు చేసే పదార్థాలు 50kg బెల్లం, 1200 kg ల బెల్లం పానకం, పదార్థాలు సీజ్ చేసి నాటుసారా డ్రమ్ములని పారపోశామని, నాటు సార తయారు చేస్తున్న జర్కుల రమేష్,నేనవత్ భీంలా, జర్పల్లి కమ్లి బాయ్, జాగిని బాయ్ ల పైన కేసు నమోదు చేశామని అన్నారు.

దాడులు నిర్వహించిన వారిలో ఏఈస్ శ్రీనివాస్ రెడ్డి, డిటీఫ్ సీఐ ధన్వంత్ రెడ్డి, ఏసై లు కోటీశ్వర్ రావు, రాములు, చితపూర్ డీఎస్పీ విజయ్ కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు.

ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి :