Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజిల్లా వార్తలునల్గొండరాజకీయం

యువతకు అండగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్ : మంత్రి జగదీష్ రెడ్డి

యువతకు అండగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్

: మంత్రి జగదీష్ రెడ్డి

మిర్యాలగూడ, మనసాక్షి: యువతకు అండగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్ నిలుస్తుంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో ఎన్బీ ఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2,3,4, మరియు ఎస్ఐ & పోలిస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిభిరం నందు ఉచిత మెటీరియల్ పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి
ఎన్బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్దులకు మెటీరియల్ ను మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు .

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎన్బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ అత్యుత్తమమైన ఫ్యాకల్టీ ద్వార శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు, కష్ట పడి చదివి ఉద్యోగాల సాధనకు యువత కృషి చేయాలని శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సూచించారు. నేటి పోటీ ప్రపంచంలోనూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ సేవలు స్ఫూర్తిదాయకమని శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాద్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, వెంకటరమణచౌదరి(బాబి), పట్టణ యువజన అద్యక్షులు కౌన్సిలర్ షైక్ జావీద్, బాసాని గిరి, ఎన్బీ ఆర్ ఫౌండేషన్ సభ్యులు షోయబ్, తిరుమలగిరి వజ్రం, యరమల్ల దినేష్, బాల శ్రీనివాస్ నాయడు, ఆయిల్ శ్రీను, సాదినేని శ్రీనివాస్, కోటేశ్వర్ రావు, ఆంజనేయ రాజు, శ్రవణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అధ్యాపకులు సుద్దుల సైదులు, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

1. REVIEW: విప్లవంలో మిళితమైన ప్రేమకథ ‘విరాటపర్వం’

2. అగ్నిపథ్ ఆందోళనలు, 71 రైళ్లు రద్దు

3. పీడీఎస్ బియ్యం వాహనం పట్టివేత – latest news

మరిన్ని వార్తలు