సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

పాట్నా : జెడీయు అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్ భవన్ లో బీహార్ రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్జెడితో కలిసి నితీష్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోటే రాజీనామా చేసినట్లు నితీష్ కుమార్ పేర్కొన్నారు. కొన్నాళ్లుగా బిజెపితో సంబంధాలు సరిగా లేని కారణంగా ఆయన ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేశారు. బీహార్ లో బిజెపి (77) జేడియు (45) కూటమి పాలన ముగిసింది.

ALSO READ : 

BREAKING : మునుగోడు పై గుత్తా ఆసక్తికరమైన వ్యాఖ్యలు 

ఓ వైపు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు.. మరోవైపు పొట్టకూటి కోసం గాంధీగా వేషధారణ

బస్సు లారీ ఢీ , తప్పిన ప్రమాదం