District collector : వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
District collector : వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ప్రస్తుతం గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, పంచాయతీ కార్యదర్శులతో యూడీ ఐ డీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ ఆర్ ఎస్, డి ఎస్ ఆర్, వీసీ పీసీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రెడ్, ఎల్లో యాబిటేషన్స్ లలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం పరంగా మెరుగైన సేవలను అందించాలన్నారు. జిల్లాలోని మాగనూర్, ఉజ్జెల్లి, కొల్పూర్, అడవి సత్యవార్, ఐనాపూర్, తంగిడి, కుసుమూర్తి గ్రామాల్లో తాగునీటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆయా గ్రామాల కార్యదర్శులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
మండల అధికారులు సైతం రోజూ గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యూడీఐడి పోర్టల్ పై గ్రామ సభలలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తు దారులందరికి ఫోన్ చేసి ఫీజు చెల్లించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.
రోజూ వారీగా ఎల్ ఆర్ ఎస్ ఫీజు లక్షాన్ని నిర్దేశించుకుని టార్గెట్ ను పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలోని సింగారం, మరికల్, ఊట్కూరు లో పెద్ద సంఖ్యలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులున్నాయని ఆయా గ్రామాల కార్యదర్శులతో పాటు ఎంపీడీఓ లు టార్గెట్ ప్రకారం ఫీజు వసూలు చేయాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయని, కానీ గ్రామీణ ప్రాంతాలలో సరిగ్గా లేవని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లోనూ వేగం పెంచాలని సూచించారు. కాగా అంతకు ముందు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ యూడీ ఐ డి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ ఆర్ ఎస్, డీ ఎస్ ఆర్, వీసీ పీసీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంశాలపై ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘంగా చర్చించి, అంశాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను గడువులో చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, డిపిఓ కృష్ణ, జెడ్పి డిప్యూటీ సీఈవో జ్యోతి, డీ డబ్ల్యూ ఓ జయ పాల్గొన్నారు.
MOST READ :









