Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లావిద్య

Old days : అలనాటి మధుర స్మృతులు

Old days : అలనాటి మధుర స్మృతులు

పినపాక. మన సాక్షి :

ఆనాటి జ్ఞాపకాలు మధుర స్మృతులేనని 1998 – 1999 నాటి విద్యార్థులు ఈనాటి పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానం పేట జిల్లా పరిషత్ పాఠశాలలో 1998 – 1999 మధ్య పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లోను, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడినవారు ఆదివారం హరిత హోటల్ భద్రాచలంలో ఒకే చోట కలుసుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుకలు జరుపుకున్నారు.

 

పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 24 ఏళ్ల తరువాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం అంటూ ఆనంద భాష్పాలతో వారి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు రత్న శేఖర్ మాట్లాడారు.

 

ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రత్న శేఖర్ గోవిందు, నవీన్, రామ్ కిషోర్, పూర్ణచందర్రావు, వెంకటరెడ్డి, రాజు, మధు, రాంబాబు, చిరంజీవి, అనురాధ, లీలావతి, అనంత నాగలక్ష్మి, రమాదేవి, గీత,మణి, ప్రసన్న, రామ రజిత, వాసవి, రాంబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు