Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడం.. తలకిందులుగా తపస్సు..!

ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడం.. తలకిందులుగా తపస్సు..!

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి

సిద్దిపేట్ , మనసాక్షి :
ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడం అనేది తలకిందులుగా తపస్సు చేసిన వీలుగాని అంశమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు.

జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమేనని, దీనిపై ప్రధాని మోడీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామనడం సరికాదన్నారు. ఒకే దేశం,ఒకే పన్ను, ఓకే ఎన్నిక అన్న మోడీ పెట్రోల్ ఉత్పత్తులను పక్కదారి పట్టిస్తూ జీఎస్టీని అమలు చేయడం లేదన్నారు.

Also ReadViral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!

దేశంలో 28 పార్టీలు బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో ముందుకు పోతున్నాయని తెలిపారు. గతంలో పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఏది చెప్పామో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పామన్నారు. పొత్తులో భాగంగా మేము అడిగిన ఐదు సీట్లు ఇవ్వకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉన్న 33 నియోజకవర్గాల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు.

వీరితో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేష్ పార్టీ శ్రేణులు ఎడల వనేష్ ఎగ్గోజు సుదర్శన చారి సంజీవరెడ్డి మల్లారెడ్డి మహిళలు తదితరులు ఉన్నారు.

ALSO READ : 

1. THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!

2. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!

3. Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!

4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

మరిన్ని వార్తలు