చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

నాగిరెడ్డిపేట్ , మనసాక్షి :

నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన ఒడ్డే చిన్న రాజు ( 32 ) చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు స్థానిక ఇన్చార్జ్ ఎస్సై లచ్చి రామ్ నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

 

బొల్లారం గ్రామానికి చెందిన ఒడ్డే చిన్న రాజు ఈ నెల 23 తేదీనా రాత్రి చేపల వేట కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీసులకు చిన్న రాజు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా చిన్న రాజు బుధవారం ఉదయం బొల్లారం గ్రామ సమీపంలోని ఊర చెరువులో శవమై తేలాడన్నారు. చేపల వేటకు వెళ్లి ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు.

 

మృతుని అన్న వడ్డే లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ లచ్చిరాం నాయక్ తెలిపారు. మృతుడికి భార్య సావిత్రి, ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

 

ALSO READ : 

  1. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
  2. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  3. Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!