Employees : ఒకే గ్రామానికి చెందిన 8 మంది పోలీసులయ్యారు.. గ్రామస్తులంతా హర్షం..!
Employees : ఒకే గ్రామానికి చెందిన 8 మంది పోలీసులయ్యారు.. గ్రామస్తులంతా హర్షం..!
నల్లగొండ (హాలియా), మన సాక్షి :
నల్లగొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పులిమామిడి గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువతి యువకులు పోలీసులయ్యారు.
ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!
ఎనిమిది మంది గ్రామస్తులు ఒకేసారి ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల ఫలితాల్లో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఉద్యోగాలు సాధించిన వారిలో.. మాలే మమత సివిల్, కళ్యాణి ఎక్సైజ్, వీక్షిత్ రెడ్డి సివిల్, నాగి రెడ్డి సివిల్, కోటిరెడ్డి ఏఆర్, శివ సివిల్, వెంకట్ రెడ్డి ఏఆర్, గణేష్ ఏఆర్ ఉన్నారు.
తమ గ్రామానికి చెందిన ఒకేసారి ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!










