యువతి కనబడుటలేదు..!

యువతి కనబడుటలేదు..!

హత్నూర, మన సాక్షి:

యువతి కనబడుటలేదు సంఘటన గురువారం హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హత్నూర ఎస్ ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.బీహార్ రాష్ట్రం, ఫులాహ్రా గ్రామం సమస్తిపూర్ జిల్లాకు చెందిన యువతి ఈనెల 25వ తేదీన మనీషా కుమారి తండ్రి సురేష్ ముఖియా ,వయస్సు: 11సంవత్సరాలు యువతి తప్పిపోయినట్లు ఆ యువతీ సోదరి సత్యవతి సత్యవతి కుమారి తెలుపగా,సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామాoలో కూలీ పనులు చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నారని ఎస్ ఐ తెలిపారు,

 

ఆమె అక్క వద్దకు నెల క్రితం నుండి బీహార్ నుండి వచ్చి తన నివాసం ఉంటున్నాము ఉండగా ఈనెల 25 తెల్లవారుజామున 5:00 గంటలకు మనీషా కుమారి మల్కాపూర్ గ్రామం నుండి తప్పిపోయిందని గుర్తించి సమాచారం ఇవ్వకుండా గది నుండి వెళ్లిపోయింది. ఆమె సోదరి తెలిపిందని ఎస్ఐ తెలిపారు, తప్పిపోయిన యువతి తెల్లటి టి షర్ట్, గ్రీన్ షర్ట్ , పర్పుల్ కలర్ ప్యాంట్ ధరించింది తనతో పాటు ఒక గొడుగు, ఒక చద్దర్ తీసుకువెళ్లింది ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు,

 

ఆమెకు హిందీ , బీహారీ మాట్లాడుతుందని ఎస్ఐ పేర్కొన్నారు, యువతి సోదరి సత్యకుమారి ఫిర్యాదు మేరకు. హత్నూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే ఈ క్రింది నంబర్లలో సంప్రదించండి.
1) 8712656752
2) 8712656730
3) 9177515983 లేదా 100కి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సుభాష్ తెలిపారు.

 

ALSO READ :

  1. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  2. Viral : నీ ఏడుపు చల్లగుండ.. కళ్ళు పోయాలా ఏడ్చిండు..!
  3. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?