Crime News : విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దారుణ హత్య

చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న హర్యా (40) హత్యకు గురయ్యాడు.

Crime News : విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దారుణ హత్య

శంకర్‌పల్లి, మన సాక్షి :

చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న హర్యా (40) హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని హత్య చేసి సబ్ స్టేషన్ ఫోన్, పర్సనల్ ఫోన్లు తీసుకుని పారిపోయారు.

మృతుడు శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన హర్యా ఆలూరు సబ్ స్టేషన్ లో రెండేళ్లుగా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మోకిల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.