తడిసిన ధాన్యానికి మద్దతు చెల్లించాలి – ముదిరెడ్డి
తడిసిన ధాన్యానికి మద్దతు చెల్లించాలి
మిర్యాలగూడ, మనసాక్షి :
తడిచిన ధాన్యానికి ఐకెపి కేంద్రాలలో మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, రాష్ట్ర నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు ఐకెపి కేంద్రంలో దాన్యం రాశులను వారు పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… గత నెల రోజులుగా ఐకెపి సెంటర్లలో ధాన్యం తీసుకొని వచ్చిన రైతులు పడి కాపులు కాస్తున్నా.. కాంటాలు వేయలేదన్నారు. అరకొర లారీలను హమాలీలను తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులు నిమ్మకనీరెత్తినట్టుగా ఉండి సరైన బస్తాలు లేక కాంటాలు వేయలేకపోతున్నారన్నారు.
కనీసం వర్షం వస్తే తార్పాల్ ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందని, గత మూడు రోజులుగా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తా ఉంటే రైతులు దిగాలు చెంది గుండెల ఆగిపోయేల రోదిస్తూ వరికుప్పల మీద పడిపోతున్నారని అన్నారు. వర్షం వల్ల ధాన్యం తడిసి మొలకలు ఎత్తిన పరిస్థితి ఈ ఐకెపి సెంటర్లో ఉన్నదని . మొలకెత్తిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత ఎమ్మెల్యే , టిఆర్ఎస్ నాయకులు ఆత్మీయ సమ్మేళనాలతో ఎంజాయ్ చేస్తూ రైతులని పట్టించుకోకుండా ఐకెపి సెంటర్లలో పరిశీలించకుండా రైతుల గోడు పట్టించుకోకుండా హమాలీలు , లారీలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున హైవేని దిగ్బంధం చేస్తామని, రైతుల తరఫున పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తా ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కంచుగట్ల లింగయ్య యాదవ్, తలకొప్పుల సైదులు, స్థానిక సర్పంచ్ మచ్చ వెంకన్న ,ఎంపీటీసీ బలరాం నాయక్ బెడదూరి వెంకట్ రెడ్డి మండల మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌస్, తుంగపాడు ఉపసర్పంచ్ షాగం కరుణాకర్ రెడ్డి , బంటు రామచంద్ర , నక్కా నగేష్ , రెమిడీల శ్రీనివాస్ , మచ్చ అంజి మధుసూదన్, రైతులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









