మిర్యాలగూడ : ధాన్యం ఎగుమతి దిగుమతులపై తనిఖీల బృందం ఏర్పాటు
మిర్యాలగూడ : ధాన్యం ఎగుమతి దిగుమతులపై తనిఖీల బృందం ఏర్పాటు
మిల్లులను సందర్శించిన డీఎస్ఓ, డిఎం
మిర్యాలగూడ , మనసాక్షి
ధాన్యం ఎగుమతి దిగుమతులపై జిల్లా స్థాయిలో తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు తెలిపారు శనివారం సాయంత్రం సప్తగిరి, మహేశ్వరి, మహర్షి రైస్ మిల్లలను వారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ధాన్యం దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులు గురి చేస్తున్నట్టు విషయం దృష్టికి వచ్చిందని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు, మిల్లులలో ధాన్యం దిగుమతి చేసుకునే విషయంలో జిల్లా స్థాయిలో తనిఖీల బృందం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ బృందం ప్రతిరోజు ఐకెపి కేంద్రాలను, మిల్లులను సందర్శించి ఎగుమతి దిగుమతులపై పర్యవేక్షిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బృందాలను ఏర్పాటు చేశామని ఎగుమతి దిగుమతులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఐకెపి కేంద్రాల నుంచి 700 నుంచి 750 లారీల్లో ధాన్యం ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.
జిల్లాలో ఇప్పటి వరకు 2.25 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేయడంలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దారులు రామకృష్ణారెడ్డి, యశ్వంత్, జావేద్, విజయ, ఆర్ ఐ లు సురేందర్ సింగ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.










