Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Paddy : ధాన్యం దిగుమతిలో టార్గెట్ పూర్తి చేయాలి

ధాన్యం దిగుమతిలో టార్గెట్ పూర్తి చేయాలి

వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా కేంద్రాలను సందర్శించాలి

మిర్యాలగూడ, మనసాక్షి :

రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం దిగుమతి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు వ్యవసాయ అధికారులు మానిటరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం జరిపి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల సూచన మేరకు ధాన్యం దిగుమతి లక్ష్యాన్ని తగ్గించామని తెలిపారు. సన్న రకం ధాన్యం ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల మిల్లులలో స్థలం లేకపోవడంతో మిల్లర్ల సూచన మేరకు ధాన్యం దిగుమతి లక్ష్యం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లక్ష్యం ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నారని మిగిలిన 40 వేల టన్నుల ధాన్యం దిగుమతి వెంటనే చేపట్టాలని సూచించారు.


ధాన్యం తక్కువ దిగుమతి చేసుకున్న మిల్లర్లు తమ కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు. కొన్ని మిల్లులకే ధాన్యం అలాట్మెంట్ చేయడం జరిగింది కాదని, లోడింగ్ బట్టి ఆయా మిల్లులకు విభజించి పంపిణీ చేయాలని కోరారు.

అన్ని మిల్లులకు ధాన్యం వెళ్ళే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి సర్టిఫైడ్ చేయాలని ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్మహించవద్దని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏ డి ఏ నాగమణి , సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణారెడ్డి , మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ,అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ , కార్యదర్శి వెంకటరమణా చౌదరి, సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్, మానిటరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు