మిర్యాలగూడ : గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జూలకంటి వినతి

మిర్యాలగూడ : గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జూలకంటి వినతి

మిర్యాలగూడ టౌన్,మన సాక్షి:

గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని వెంటనే సమ్మెను విరవింపజేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాదులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలో సుమారు 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వారిని తమ ప్రాణాలను ఆరోగ్యంగా లెక్కచేయకుండా గ్రామాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని చెప్పారు.

 

గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు గ్రామపంచాయతీ సిబ్బంది లందరికీ పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు పి ఆర్ సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ ను 19500 వేతనంగా చెల్లించాలని, స్వీపర్లకు 15,600 పెంచాలన్నారు. ఆపరేటర్లు ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు 19500 వేతనాలు ఇవ్వాలన్నారు.

 

కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీలే లైసెన్సుల ఖర్చులు భరించాలన్నారు. జీవో 51 ని సవరించి మల్టీపర్పస్ పర్సన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత కేటగిరీలు అన్నిటిని యధావిధిగా కొనసాగించాలన్నారు.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదవండి 👇

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

 

ప్రమాదంలో చనిపోయిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలని పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, గ్రా డ్యూటీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.

 

ఆదాయం ఉన్న పంచాయతీలలో వేతనాలు పెంపునకు అనుమతి ఇవ్వాలని, వయసు పైబడిన కార్మికులను తొలగిస్తే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కొత్తగా నియమించిన కార్మికుల వేతనాలు పెంచి అవసర ప్రాతిపదికన కొత్తగా నియమించే వారిని గ్రామపంచాయతీ తీర్మానం డిపిఓ అనుమతి తర్వాత నియామకాలు జరపాలన్నారు.

 

8 గంటల పని విధానాన్ని అమలు చేసి వారంతపు, పండుగ, జాతీయ సెలవు దినాలలో అమలు చేయాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని గ్రామపంచాయతీ సిబ్బంది యూనియన్ తో చర్చలు జరిపి పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్టు తెలిపారు