Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకొమరంభీం జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

PDS RICE : రేషన్ బియ్యం భారీగా పట్టివేత

రేషన్ బియ్యం భారీగా పట్టివేత

కొమరం భీం ఆసిఫాబాద్, మన సాక్షి.

కాగజ్ నగర్ పట్టణంలో అక్రమంగా రవాణా చేసేందుకు నిలువ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు, అధికారులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి,

 

కాగజ్ నగర్ పట్టణంలోని తైబా నగర్ రాయల్ లాడ్జి ఏరియాలో ఒక పూరి గుడిసెలో అక్రమంగా మినీ ఐచర్ వ్యాన్ టి ఎస్01UB4765, బొలెరో పికప్ ఏపీ 01Y3200 రెండు వాహనాలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఉన్నాయని పక్క సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు, వీటితోపాటు రేషన్ బియ్యాన్ని తరలించే ఎం.డి అఫ్జల్, కుక్క రాజేశం ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

 

చుట్టుపక్కల గ్రామాల్లో రూపాయలు 14 కు కొనుగోలు చేసి 18 రూపాయలకు మహారాష్ట్ర వీరూరులో అమ్ముతున్నట్లు రేషన్ బియ్యాన్ని రజిక్ అనే వ్యక్తి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు, పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఎం ఎల్ ఎస్ పాయింట్ కు తరలించి తూకం వేసినట్లు 150 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని విచారణలో తేలినట్టు తెలిపారు,

 

పట్టుకున్న రేషన్ బియ్యాన్ని జిల్లా డి సి ఎస్ ఓ అధికారిని తారామని పరిశీలించి నట్ట్లు తెలిపారు, అధికారిని వెంట సివిల్ సప్లై డిటి శ్రీనివాస్, శ్యామ్లాల్, రాజ్ కుమార్, అన్నారు.

మరిన్ని వార్తలు