Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Devarakonda : దైవ చింతనతో మానసిక ప్రశాంతత.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

Devarakonda : దైవ చింతనతో మానసిక ప్రశాంతత.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

చింతపల్లి, మన సాక్షి :

దైవచింతన తో మానసిక ప్రశాంత మనశ్శాంతి కలుగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు . సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోగల బట్టుగూడం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఉదయం నుండి స్వామి వారికి అభిషేకాలు, స్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండుగ వేలాది మంది భక్తుల నడుమ వేదమంత్రోచ్ఛర్నులతో కరుల రవీందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలునాయక్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి వారు మాట్లాడారు.

దైవ సంకల్పంతో ఏ పని అయినా నిర్విఘ్నంగా నిర్వహించవచ్చునని స్వామి కృపతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరారు.

ఈ కార్యక్రమంలో డి సంజీవరెడ్డి,అలివేలు, నాయిని మాధవరెడ్డి, ఎండి సి రాజు ఖాన్, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగి రేకులు నాగభూషణం, రవి నాయక్, ఎస్ శత్రజ్ఞ రాజు, ముచ్చర్ల యాదగిరి, రాజేష్, శ్రీనివాస్, వి శకృనాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు