Miryalaguda : డాక్టర్స్ కాలనిలో ట్రాఫిక్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదు..!
Miryalaguda : డాక్టర్స్ కాలనిలో ట్రాఫిక్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదు..!
మిర్యాలగూడ,, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని డాక్టర్స్ కాలనీలో ప్రజలు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడకూడదని మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో
హాస్పిటల్స్ యూనియన్ , మెడికల్ యూనియన్, పోలీస్ అధికారులతో ఆ విషయం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనిలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందన్నారు. వాహనాలు అధికమంగా రోడ్డుపైనే పార్కింగ్ చేయడం వలన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సమస్యను అరికట్టాలంటే హాస్పిటల్ వారు, మెడికల్ షాప్స్ వారి సహకారం చాలా కీలకం, అలాగే పోలీస్ వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా డాక్టర్స్ కాలనిలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా కట్టడి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.
MOST READ :









