Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : పరిశ్రమలకు గడువులోపే అనుమతులు ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : పరిశ్రమలకు గడువులోపే అనుమతులు ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్న వారికి
నిర్ణీత గడువులోపు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన టీజీ ఐ పాస్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. చివరగా టీజీ ఐపాస్ సమావేశం ఎప్పుడు జరిగిందని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాల గురించి పరిశ్రమల శాఖ జిఎం మహేశ్వర్ కలెక్టర్ కు వివరించారు.

టీజీ ఐపాస్ కింద గత నవంబరు 7 వ తేదీ నుంచి ఈ నెల 6 వరకు పరిశ్రమల కై 14 అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా వాటిలో 9 అనుమతులు మంజూరయ్యాయని, 2 ప్రాసెస్ లో ఉన్నాయనీ, ఒకటి తిరస్కరించబడిందని, మిగతా 2 అభ్యంతరాలు ఉన్నాయని జీ.ఎం. కలెక్టర్ కు తెలిపారు.  టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్టీవో మేఘా గాంధీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్, ఐ పీ వో నర్సింగ్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈ. డీ. అబ్దుల్ ఖలీల్, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారి, సబ్ రిజిస్టార్ రామ్ జీ, భూగర్భ జల శాఖ సీనియర్ అసిస్టెంట్ చైతన్య కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ అధికారి తాజుద్దీన్, కార్మిక శాఖ అధికారి తిలక్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు